Wednesday , August 5 2020
Home / Entertainment / అంగరంగ వైభవంగా జరిగిన నటి అర్చన వివాహం
archana marriage
archana marriage

అంగరంగ వైభవంగా జరిగిన నటి అర్చన వివాహం

సినీ నటి, బిగ్ బాస్ సీజన్ 1 కాంటస్టెంట్ అర్చన, ప్రముఖ హెల్త్‌కేర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడుముళ్లతో ఇద్దరు ఒకటయ్యారు. ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యి కొత్త జంటను ఆశీర్వదించారు. అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరగగా మంగళవారం రాత్రి సంగీత్ తో పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది.

బుధవారం రాత్రి పెళ్లి రిసెప్షన్‌ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు అర్చన, జగదీశ్‌ మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు. కాగా వీరి ఇద్దరి వివాహానికి సంబంధించిన పెళ్లి వీడియోను ప్రోమో రూపంలో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

About admin

Check Also

Prema Pipasi Movie

‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ..

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ముర‌ళీస్వామి నిర్మాత‌: పిఎస్‌ రామ‌కృష్ణ‌ న‌టీన‌టులు: జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సొనాక్షి వ‌ర్మ, జ్యోతి రాజ్‌పుత్‌, మ‌మ‌త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *