Wednesday , August 5 2020
Home / Cinema / ప్రేమికుల రోజున ‘నేను c/o ఆఫ్ నువ్వు’ వచ్చేస్తోంది!

ప్రేమికుల రోజున ‘నేను c/o ఆఫ్ నువ్వు’ వచ్చేస్తోంది!

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సినిమా  ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న అనగా లవర్స్ డే నాడు ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.

డైరెక్టర్ సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాను. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

బ్యానర్: అగపే అకాడమీ

డిఓపి: జి.కృష్ణ ప్రసాద్

లిరిక్స్: ప్రణవం

మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్

ఆర్ట్: పి.ఎస్.వర్మ

యాక్షన్: షొలిన్ మల్లేష్

కొరియోగ్రాఫర్: నరేష్

సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా 

కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ

About admin

Check Also

Prema Pipasi Movie

‘ప్రేమ పిపాసి’ మూవీ రివ్యూ..

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ముర‌ళీస్వామి నిర్మాత‌: పిఎస్‌ రామ‌కృష్ణ‌ న‌టీన‌టులు: జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సొనాక్షి వ‌ర్మ, జ్యోతి రాజ్‌పుత్‌, మ‌మ‌త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *